చిత్తూరు జిల్లాలో కారు ప్రమాదం.. ముగ్గురు మృతి - గుండ్లగుట్టపల్లి కారు ప్రమాదం వార్తలు

చిత్తూరు జిల్లాలో కారు ప్రమాదం.. ముగ్గురు మృతి
14:59 May 09
చిత్తూరు జిల్లాలో కారు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పాకాల మండలం గుండ్లగుట్టపల్లి వద్ద కారు బోల్తా పడింది. చెన్నై పెరియకోయిల్ బాకం నుంచి సిద్దిపేట మల్లన్నసాగర్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఘటనలో వేలు (27), మణిబాలన్ (25), వేణుగోపాల్ (60) మృతి చెందారు. కారులో తమిళనాడు నుంచి తెలంగాణ వెళ్లేందుకు అనుమతి పత్రాలు ఉన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Last Updated : May 9, 2020, 3:34 PM IST