నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు.. రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
టీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం - nalgonda district latest news
అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

టీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం
స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన సమయంలో టీ స్టాల్ వద్ద రద్దీ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి: వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్‌లో మృతి చెందిన మహిళ