హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు హైటెక్ సిటీ రోడ్డులోని అంకుర్ ఆస్పత్రి వద్ద ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారికి పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో కారులో సమరసింహారెడ్డి(28), ప్రణిత్(27), యామిని( 27) ప్రయాణిస్తున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
కేపీహెచ్‌బీ కాలనీలో తప్పిన పెను ప్రమాదం - తెలంగాణ తాజా వార్తలు
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వేగంగా వచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారికి పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ప్రయాణిస్తున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో తప్పిన పెను ప్రమాదం
సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తాగినట్లు స్థానికులు చెబుతున్నారు.