తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గంజాయి అక్రమ రవాణా.. కానిస్టేబుల్​ అరెస్ట్​ - hyderabad crime news

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కానిస్టేబుల్​ను ఉప్పల్​ ఎక్సైజ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు ఏపీలోని అనంతపురం జిల్లాలో ఏఆర్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ganja seized
గంజాయి అక్రమ రవాణా.. కానిస్టేబుల్​ అరెస్ట్​

By

Published : Dec 13, 2020, 7:51 AM IST

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసే.. వ్యాపారంలోకి దిగాడు.. కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఉన్నతాధికారుల కళ్లుగప్పి వ్యాపారం సాగిస్తున్నాడు.

ఏపీలోని అనంతపురం ఏఆర్​ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న మోహన్ కృష్ణ.. హైదరాబాద్​ శివారులో గంజాయి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు.. నల్లా చెరువు వద్ద నిఘా పెట్టారు. సుమారు 200 కిలోల గంజాయి సహా కారును స్వాధీనం చేసుకున్నారు. మోహన్​ కృష్ణ సహా ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

ఇవీచూడండి:స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details