చదువులో రాణించాడు. మరికొన్ని రోజుల్లో సీఏ పూర్తి చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన ఓ యువ విద్యార్థి జీవితాన్ని ఆన్లైన్ రమ్మీ అర్ధాంతరంగా ముగించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన అభిలాష్(25) సీఏ చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసై లక్షల రూపాయలు అప్పుచేశాడు.
ఆన్లైన్ రమ్మీ అప్పుతో సీఏ విద్యార్థి బలవన్మరణం - manchirial district news
చిన్నప్పటి నుంచి చదువులో రాణించాడు. ఉన్నత విద్యలో ప్రత్యేక కోర్సులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన సమయంలోనే ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ అప్పులపాలై ఓ యువకుడు బలవన్మరణం పొందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడం వల్ల గత 20 రోజులుగా ఇంటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆదివారం రాత్రి మనస్తాపంతో మంచిర్యాలలోని గోదావరి నది సమీపంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అభిలాష్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. అతని చేతిపై సోదరుడు ఆకాశ్ సెల్ నంబరు ఉండటంతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: మత్తు పదార్థాలు అమ్ముతున్న యువకుడి అరెస్ట్