ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఓ వోల్వో బస్సు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి.. ఇంట్లోకి దూసుకెళ్లింది. కృష్ణారావు అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు... ఇద్దరికి తీవ్రగాయాలు - khammam district crime news
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్‌గూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ వోల్వో బస్సు... అదుపుతప్పి... ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు... ఇద్దరికి తీవ్రగాయాలు
ఇదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి:అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం
Last Updated : Sep 12, 2020, 12:31 PM IST