తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో డ్రైవింగ్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం - వికారాబాద్​లో బస్సు ప్రమాదం

బురదలో కూరుకుపోయి ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో నలుగురికి గాయాలయ్యాయి. రోడ్డు పక్క బురద లేకపోతే.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్​ మద్యం మత్తులో ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.

Bus Accident In Vikarabad District four passengers injured
మద్యం మత్తులో డ్రైవింగ్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

By

Published : Oct 19, 2020, 9:08 PM IST

వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యాలాల మండలం మీదుగా తాండూరుకు బయల్దేరింది. యాలాల మండలానికి చెందిన నాగసముద్రం గేటు వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు దిగింది.

రోడ్డు పక్కన బురద ఉండటం వల్ల బస్సు అందులో కూరుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో నలుగురు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం తాగి నడిపినందుకే బస్సు ప్రమాదానికి గురైందని.. ప్రయాణికులు తెలిపారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్​పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:సమంత కొడుకు కోసం ఉపాసన స్పెషల్​ గిఫ్ట్​!

ABOUT THE AUTHOR

...view details