ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావుబంజర వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
లారీని ఢీకొట్టిన సింగరేణి బస్సు.. నలుగురికి గాయాలు - సింగరేణి కార్మికుల బస్సు ప్రమాదం వార్తలు
సింగరేణి కార్మికులతో వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
లారీని ఢీకొట్టిన సింగరేణి బస్సు.. నలుగురికి గాయాలు
కొత్తగూడెం నుంచి సత్తుపల్లి బొగ్గు ఉపరితల గనిలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులను తీసుకొస్తున్న సింగరేణి బస్సు.. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో గాయపడిన వారిని సింగరేణి సంస్థ అంబులెన్స్‌లో కొత్తగూడెం సింగరేణి ఆస్పత్రికి తరలించారు.