రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై పైన ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగిఉన్న బైకు ఢీకొన్న బస్సు... మహిళ అక్కడికక్కడే మృతి - rajendranagar news
ఆగిఉన్న ద్విచక్రవాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రాజేంద్రనగర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వద్ద జరిగింది.

bus accident at rajendranagar and women spot dead
డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపించారు. స్థానికులు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసి.. ఆందోళనకు దిగారు. డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.