తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గడ్డి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం - Burning lorry On the outskirts of Satwar

గడ్డి లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Burning lorry going with a load of grass On the outskirts of Satwar in Sangareddy District
గడ్డి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

By

Published : Nov 23, 2020, 3:07 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలం సత్వార్​ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై చిరాగ్​పల్లి నుంచి గడ్డి నింపుకుని జహీరాబాద్​ వైపు వస్తున్న లారీ క్యాబీన్​లో మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన డ్రైవర్​ రోడ్డుపై నిలిపివేశాడు. లారీ క్యాబిన్​లోని వస్తువులను కిందికి దింపుకునిలోగా మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్​ ఇంజిన్​ చేరుకుని మంటలను అదుపు చేయడం వల్ల లారీ పూర్తిగా దగ్ధం కాకుండా మిగిలిపోయింది. ఘటనాస్థలానికి చిరాగ్​పల్లి ఎస్​ఐ గణేశ్​ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details