వికారాబాద్ జిల్లాలో బుల్లెట్ కలకలం రేపింది. యాలాల మండలం మండల్‌పూర్‌లో బుల్లెట్, మాగ్‌జైన్ లభించాయి. అడవిలో పశువులను మేపడానికి వెళ్లిన పశువుల కాపర్లకు కనిపించడంతో సర్పంచ్‌కు సమాచారం అందించారు.
వికారాబాద్ అడవిలో బుల్లెట్ కలకలం... ఎక్కడిది? - వికారాబాద్ జిల్లాలో బుల్లెట్ లభ్యం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం మండల్‌పూర్‌లో బుల్లెట్, మాగ్‌జైన్ దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
bullet
సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు అడవి ప్రాంతంలోకి వెళ్లి... బుల్లెట్, మాగ్జైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అడవిలో వేటకు వచ్చి వదిలి వెళ్లారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :ఆ కోడి మాంసానికి ధర ఎక్కువ.. ఎందుకో తెలుసా?