చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తి కోయ గూడెంలో జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా ఇంబీమ్కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేశారు.
దారుణం: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య - mulugu latest news
ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తికోయ గూడెంలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు.
అసలు ఏమైందంటే...
జలగలంచగూడెంకు చెందిన కురసం భద్రయ్య ఇంటికి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అర్జున్ అప్పుడప్పుడు వచ్చేవాడు. అతడికి చేతబడి వచ్చని... అందువల్లనే పలు సమస్యలు వచ్చాయని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భద్రయ్యతో చెప్పాడు. దాన్ని మనసులో పెట్టుకున్న భద్రయ్య ఈనెల 26న ఇంటికి వచ్చిన అర్జున్‌కు మద్యం తాపించి మద్యం మత్తులో ఉండగా మరో వ్యక్తితో కలిసి గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని... మృతదేహాన్ని ఏటూరునాగారం మార్చురీకి తరలించారు.