తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

క్షణికావేశంలో అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు - కెరమెరి మండలంలో అన్నపై దాడి

మద్యానికి బానిసైన ఓ అన్న... విచక్షణ కోల్పోయాడు. చెల్లితో, తండ్రితో గొడవ పడ్డాడు. ఇదంతా చూసిన తమ్ముడు గొడవను సద్దుమణిగించాలనుకున్నాడు. అయినప్పటికీ అతనూ సహనం కోల్పోయాడు. క్షణికావేశంలో అన్నపై కత్తితో దాడికి దిగాడు.

brothers fight for money in  Kermeri Zone, Kumarakom Bhim District
క్షణికావేశంలో అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు

By

Published : Nov 20, 2020, 7:04 PM IST

కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని పోలీస్​ స్టేషన్​ క్వర్టర్స్​లో హెడ్​ కానిస్టేబుల్​ రాఠోడ్​ పరుశురాం ఇద్దరి కొడుకుల మధ్య గొడవ తలెత్తింది. క్షణికవేశంలో మహేష్ తన సొంత అన్న రమేశ్​పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనితో తీవ్ర గాయాలపాలైన రమేశ్​ను ఆదిలాబాద్​ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మహేశ్​పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడిని రిమాండ్​కు తరలించారు.

అసలేం జరిగిందంటే?

పెద్ద కుమారుడైన రమేశ్​ వివాహం చేసుకుని వేరే ఊర్లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రమేశ్​ మద్యానికి బానిసై.. ఏ పని చేయకుండా తిరుగుతూ.. ఉండేవాడు. తరచూ తన తండ్రి వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లేవాడు. ఆ డబ్బులతో మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఉదయం కూడా డబ్బుల కోసమని తన తండ్రి వద్దకు వచ్చి... డబ్బులు అడిగిన క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

కోపోద్రిక్తుడైన రమేశ్​ తన చెల్లెలు జడను పట్టుకుని బయటకు లాగాడు. తమ్ముడు మహేశ్​.. చెల్లిని, అన్నయ్యను దూరం చేసే క్రమంలో గొడవ పెద్దదిగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశంలో అన్నపై కత్తితో దాడి చేశాడు. పలు చోట్ల గాయాలు కూడా అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే గొడవ సద్దుమణిగేలా చేసి.. రమేశ్​ను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details