తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నీటి కుంటలో పడి అన్నదమ్ముల మృతి

నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా రఘుపతిపేటలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

brothers fall in Water lame in nagar karnool district
నీటి కుంటలో పడి అన్నదమ్ముల మృతి

By

Published : Sep 5, 2020, 7:59 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలో ఒకే ఇంటికి చెందిన అన్నదమ్ములు శివ(13) అంజి (11) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన రాములు, భీమమ్మ దంపతుల కుమారులు శివ, అంజి పొలం వద్ద గేదె ఈనడంతో చూడడానికి వెళ్లారు. సమీపంలోని కుంటలో గేదెలు ఈదడం చూసి వాటిని అనుసరిస్తూ నీటి కుంటలోకి వెళ్లారు.

ఈత రాకపోవడం వల్ల నీటిలో పడి మృతి చెందారు. ఘటనా స్థలికి రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details