జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో తనకు న్యాయం చేయాలని ఓ ప్రియురాలు నిరసనకు దిగింది. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియురాలిని ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడో ప్రేమికుడు. ఈ నేపథ్యంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్షకు దిగింది.
వివరాల్లోకి వెళితే టేకుమట్లకు చెందిన కొలుగూరి కార్తీక్ ఆర్మీ జవాన్. రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన తమ బంధువైన ఓ యువతిని గత ఆరేళ్లుగా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ యువతి పెళ్లి చేసుకోమని అడగగా ముఖం చాటేశాడు.