తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉత్తర్​ప్రదేశ్​లో కిడ్నాపై.. కడపకు చేరి..! - యూపీలో బాలుడు మిస్సింగ్ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లో కిడ్నాపైన బాలుడు ఏపీలోని కడపకు చేరాడు. ఎలాగోలా కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని కడప రైల్వే స్టేషన్​కు చేరుకున్నాడు. నాలుగు రోజులపాటు కిడ్నాపర్లతో ఉండి చాకచాక్యంగా తప్పించుకున్నాడు. చివరికి ఇవాళ ఇంటికి చేరుకున్నాడు.

boy-kidnapped-in-up-and-found-in-kadapa
ఉత్తర్​ప్రదేశ్​లో కిడ్నాపై.. కడపకు చేరి..!

By

Published : Dec 8, 2020, 7:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఈ నెల ఒకటో తేదీ బాలుడు కిడ్నాప్​ అయ్యాడు. నాలుగు రోజులపాటు కిడ్నాపర్ల వెంట ఉండి.. ఎంతో చాకచక్యంగా తప్పించుకొని కడప రైల్వే స్టేషన్​కు చేరాడు. ఆర్పీఎఫ్ పోలీసులు ఆ బాలుడిని విచారించి అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఆ బాలుడిని తండ్రికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

యూపీలోని మదోహి జిల్లా బర్వాకాశ్ గ్రామం రవిదాస్ నగర్​కు చెందిన కృష్ణ కుమార్ దుబే హోంగార్డ్​గా పని చేస్తున్నాడు. అతడికి నలుగురు సంతానం. ఈ నెల 1వ తేదీన కృష్ణకుమార్ దుబే రెండో కుమారుడైనా నక్షత్ర కుమార్ దుబే బరీష్​పూర్ రైల్వేస్టేషన్​లో నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి.. మీ నాన్న పిలుస్తున్నాడని చెప్పారు. అది నిజమనుకుని బాలుడు వారి వెంట వెళ్లాడు. కిడ్నాపర్లు ఇద్దరూ బాలుడిని కారులో ఎక్కించుకొని మత్తు మందు కలిపిన భోజనం పెట్టారు.

జరిగిందిలా....

భోజనం తిన్న తర్వాత నక్షత్ర కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఉత్తర్​ప్రదేశ్ నుంచి చెన్నై మీదుగా కడప శివారులోని రింగ్ రోడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే బాలుడికి స్పృహ వచ్చింది. కిడ్నాపర్లు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టీ తాగేందుకు బయటకు దిగారు. నక్షత్ర కుమార్ చాకచక్యంగా కారులో నుంచి కిందకు దిగి.. అక్కడినుంచి తప్పించుకుని కడప రైల్వేస్టేషన్​కు చేరుకున్నాడు. ప్లాట్​ఫారంపై ఒంటరిగా ఉన్న బాలుడిని ఆర్పీఎఫ్ ఎస్సై శంకర్రావు గుర్తించి.. వివరాలు తెలుసుకున్నారు. బాలుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఉత్తర్​ప్రదేశ్​లో బాలుడి కిడ్నాప్ కేసు నమోదైంది. తర్వాత కడప ఆర్పీఎఫ్ పోలీసులు బాలుడి తండ్రికి సమాచారం చేరవేశారు. బాలుడు తండ్రి కృష్ణకుమార్ దుబే ఈరోజు కడపకు వచ్చి.. నక్షత్ర కుమార్ దుబేను తీసుకెళ్లారు. ఆర్పీఎఫ్ పోలీసుల వల్లే తన కుమారుడు క్షేమంగా తన దగ్గరకు చేరాడని తండ్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కళ్ల ముందు కుమార్తె మరణం... తండ్రికి తీరని శోకం

ABOUT THE AUTHOR

...view details