తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పదం: ఉరి తాడుకు 11 ఏళ్ల బాలుడు!

ఆడుకోవాల్సిన వయసులోనే ఆ బాలుడికి ఏం కష్టం వచ్చిందో.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారణాలు ఏమై ఉంటాయి.. బాలుడు సొంతంగా ఉరివేసుకున్నడా.. ఎవరైనా ఉరి వేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ పట్టణంలో జరిగింది.

boy-hanging-suspiciously-at-zaheerabad-in-sangareddy-district
అనుమానాస్పదం: ఉరి తాడుకు 11 ఏళ్ల బాలుడు!

By

Published : Jan 5, 2021, 10:24 PM IST

ఉరితాడుకు వేలాడుతూ 11 ఏళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో చోటుచేసుకుంది. పట్టణంలోని అల్లీపూర్​కు చెందిన వీరేశం, లక్ష్మీ దంపతుల కుమారుడు వంశీ రేకుల ఇంట్లో పైకప్పుకు ఉరి వేసుకుని మృతి చెందడంతో తండ్రి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలాన్ని జహీరాబాద్ ఎస్ఐ వెంకటేశ్​ సందర్శించారు. బాలుడు సొంతంగా ఉరివేసుకున్నాడా.. ఎవరైనా ఉరి వేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్తు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:పతంగుల దుకాణంపై దాడులు.. చైనా మాంజా స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details