తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గోదావరిలో చేపల వేటకు వెళ్లి బాలుడు మృతి - boy died

చేపల వేటకని వెళ్లి కాలు జారి గోదావరిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ఎడ్జుర్లపల్లి గ్రామంలో జరిగింది. మృతి చెందిన బాలుడి స్వస్థలం చొక్కాల గ్రామం కాగా... బంధువుల ఇంటికి మూడు రోజుల క్రితం వెళ్లాడు.

boy fell in Godavari and died in mulugu district
చేపల వేటకని వెళ్లి.. గోదావరిలో పడి బాలుడు మృతి

By

Published : Aug 29, 2020, 6:46 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన గగ్గూరి రాజేష్(16) అనే బాలుడు వాజేడు మండలం ఎడ్జుర్లపల్లి గ్రామానికి బంధువుల ఇంటికి మూడు రోజుల క్రితం వెళ్లాడు. ఈరోజు గోదావరిలో గాలాలతో చేపల వేటకు వెళ్లిన క్రమంలో ఒడ్డు మీద నుంచి జారి నదిలో పడి గల్లంతయ్యాడు.

బాలుని బంధువులు గాలించగా మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి: సరదా మిగిల్చిన విషాదం: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

ABOUT THE AUTHOR

...view details