కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం తైబ నగర్లో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు పెద్దవాగులో గల్లంతయ్యాడు. పట్టణానికి చెందిన జావెద్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇంటిపక్కవాళ్ళు పెద్దవాగుకు విహారయాత్ర వెళుతుండగా... జావెద్ చిన్న కుమారుడైన ఝాయాన్(11) కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాడు.
పక్కింటివాళ్లతో విహారయాత్రకు వెళ్లి... పెద్దవాగులో పిల్లాడు గల్లంతు
"ఇంటిపక్కన వాళ్లు విహారయాత్రకు వెళ్తున్నారు. నేనూ వెళ్తాను నాన్నా.." అని అడిగిన ఆ చిన్నారిని చిన్నబుచ్చటం ఇష్టం లేక ఆ తండ్రి పంపించాడు. యాత్రలో ఎంతో ఆనందంగా తన స్నేహితులతో గడుపుతున్నాడు కావచ్చని అనుకుంటున్న ఆ తల్లిదండ్రులకు గుండెలుపగిలే వార్త వినబడుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఈ ఘటన కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పక్కింటివాళ్లతో విహారయాత్రకు వెళ్లి... పెద్దవాగులో పిల్లాడు గల్లంతు
ఝాయాన్తో పాటు మరో ఇద్దరు పిల్లలు.. పెద్దవాగు తీరం వద్ద అడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో ముగ్గురు పిల్లలు పడిపోయారు. వారిలో ఒకరు బయటపడగా... మరొకరిని జాలర్లు రక్షించారు. ఝాయాన్ మాత్రం వాగు ప్రవాహంలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాగు ప్రవాహం అధికంగా ఉండటం వల్ల గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.