కామారెడ్డి మున్సిపాల్టీ పరిధి దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు మురుగు కాలువలో పడి నిశాంత్(05) మృతి చెందాడు.
పతంగి ఎగరేస్తూ వెళ్లి కాలువలో శవమై తేలిన చిన్నారి - Tragedy in Devunipalli
కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలోని ఓ మురుగుకాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. నిన్న మధ్యాహ్నం పతంగి ఎగురవేయడానికి వెళ్లిన బాలుడు.. మురుగుకాలువలో విగతజీవిగా కనిపించాడు.
మురుగు కాలువలో పడి బాలుడి మృతి
నిన్న మధ్యాహ్నం పతంగి ఎగురవేయడానికి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు... తెల్లవారుజామున మురుగుకాలువలో విగతజీవిగా కనిపించాడు. బాలుడి మృతిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.