మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. గ్రామానికి చెందిన సిద్ధిరాములు, సునీత దంపతుల ఏకైక కుమారుడు ప్రకాశ్(15) మరణించాడు.
పశువులను మేపేందుకు వెళ్లి...విద్యుదాఘాతానికి బాలుడు బలి
పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పొలాలకు రక్షణగా అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పశువులను మేపేందుకు వెళ్లి...విద్యుదాఘాతానికి బాలుడు బలి
అడవి పందుల బారినుంచి వరినారును కాపాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
ఇదీ చూడండి:బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు
Last Updated : Dec 15, 2020, 8:47 PM IST