ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ సమీపంలో ఉన్న దేవాదుల పైపుల కంపెనీ వద్ద నివాసముంటున్న చిరంజీవి అనే ఐదేళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలో గత కొంతకాలంగా దేవాదుల ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటకకు చెందిన కూలీలు పని ప్రదేశంలోనే గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
పిచ్చికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి - boy died at mulugu
ఐదేళ్ల బాలుడిపై పిచ్చికుక్కలు దాడి చేసి చంపేసిన విషాద సంఘటన ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో శుక్రవారం జరిగింది. మరణించిన బాలుడు దేవాదుల ప్రాజెక్టులో పని చేసే కూలీల పిల్లాడిగా గుర్తించారు.

పిచ్చికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి
కూలీలు పనికి వెళ్లగా వారి పిల్లలు గుడారాల వద్ద ఆడుకుంటున్న సమయంలో పిచ్చికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు.