ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడలోని పేద కుటుంబంలో.. విద్యుదాఘాతం తీరని వేదన మిగల్చింది. నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఎక్స్‌టెన్షన్ డబ్బాకు తగిలాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి సరదాగా ఆడుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తీరని వేదన మిగిల్చిన విద్యుదాఘాతం.. బాలుడు మృతి - ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడి మృతి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడలోని జరిగిన ఓ ప్రమాదం పేద కుటుంబంలో పేద కుటుంబంలో తీరని వేదన మిగిల్చించి. నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఎక్స్‌టెన్షన్ డబ్బాకు తగిలాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క మగబిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తీరని వేదన మిగిల్చిన విద్యుదాఘాతం.. బాలుడు మృతి
ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ పుట్టగా.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. విధి బాలుడిని దూరం చేయడంతో కుటుంబ సభ్యులు గుండెలవీసేలా విలపించడం అందరని కంటతడి పెట్టించింది.
ఇవీ చూడండి:నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్.. రిమాండ్కు తరలింపు