హైదరాబాద్ మియాపూర్లోని నరేన్ గార్డెన్స్ వద్ద సెల్లార్ కోసం తవ్విన చోట చేరిన నీటిలో పడి 14 ఏళ్ల తరుణ్ అనే అబ్బాయి మృతి చెందాడు. మియాపూర్ న్యూ కాలనీలో నివాసముంటున్న తరుణ్.. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు నరేన్ గార్డెన్స్ వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తు గుంతలో మరణించారు.
సెల్లార్ కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి - మియాపూర్లో యువకుడు మృతి
సెల్లార్ కోసం తవ్విన చోట చేరిన నీటిలో పడి పద్నాలుగేళ్ల యువకుడు మరణించిన ఘటన హైదరాబాద్ మియాపూర్లోని నరేన్ గార్డెన్స్ వద్ద జరిగింది. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశం తెలిపారు.
సెల్లార్ కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి
గతంలో ఆ ప్రాంతంలో సెల్లార్ కోసం బిల్డర్ తవ్వి వదిలేశాడు. కానీ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమిగా సూచికలు వేసి మండల రెవెన్యూ అధికారి ఉంచారు. అయితే ప్రమాదానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశం తెలిపారు.