ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లిలో చోటుచేసుకుంది. మల్లికార్జున్ కుటుంబం పది సంవత్సరాల క్రితం కర్ణాటక నుంచి వలస వచ్చి కొంపల్లిలో స్థిరపడింది. వీరి కుమారుడు మనోజ్ సోమవారం సాయంత్రం వారు ఉండే భవనంపై నుంచి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి బాలుడి మృతి - today crime news in telangana
మేడ్చల్ జిల్లా కొంపల్లిలో భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ బాలుడు కిందపడ్డాడు. గాయాలపాలైన బాబును ఆసుపత్రికి తరలించగా... అక్కడ ప్రాణాలొదిలాడు.
![ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి బాలుడి మృతి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి బాలుడి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8473094-306-8473094-1597815881777.jpg)
ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి బాలుడి మృతి
వెంటనే కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయమవడం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.