సరదాగా ఆడుకుంటున్న బాలుడిని సంపు రూపంలో మృత్యువు కాటేసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చి తీరని వేదనకు గురిచేసింది. బీహార్‌కు చెందిన శంభు కర్వార్ కుటుంబం ఇరవై రోజుల క్రితమే వచ్చి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇస్నాపూర్ శివాలయం సమీపంలో నివాసముంటున్నారు.
బాలుడిని మింగేసిన సంపు.. తల్లిదండ్రుల అనుమానం - boy death in sump sangareddy dist
ఇంటిముందు సంతోషంగా ఆడుకుంటున్న బాలుడు అంతలోనే అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఎంతవెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు సమీపంలోని సంపులో శవమై తేలాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో ఘటన జరిగింది.
అతను ఓ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికునిగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల కుమారుడు హర్షకుమార్ కనిపించడం లేదని పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుని ఆచూకీ కోసం వెతకగా ఇంటికి సమీపంలో ఉన్న ఓ సంపులో పడి బాలుడు చనిపోయినట్లు బుధవారం ఉదయం గుర్తించారు. సంపుపై మూత లేకపోవడం వల్లే ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.