యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయం వెళ్లే దారిలోని పెద్ద చెరువు కత్వాలో పడి పట్టణానికి చెందిన కార్తీక్ శర్మ అనే బాలుడు మృతి చెందాడు. పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం బాలుని మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
చెరువు కత్వాలో పడి బాలుడు మృతి - yadadri bhuvanagiri latest crime news
ప్రమాదవశాత్తు చెరువు కత్వాలో పడి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జేసీబీ సాయంతో.. పగలగొట్టి బయటికి తీయగా.. బాలుడు అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
భువనగిరి పట్టణంలోని సాయిబాబా గుడిలో పూజరిగా పనిచేసే కోటేశ్ కుమారుడు కార్తిక్ శర్మ తన స్నేహితులతో సాయంత్రం పెద్ద చెరువు కత్వా వద్దకు వెళ్లాడు. కత్వాపై స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ఆ బాలుడు నీటిలో పడిపోయాడు. నీటి ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో నీరు బయటికి వెళ్లే పైపు మధ్యలో ఇరుక్కుపోయాడు. కత్వను జేసీబీ సాయంతో పగలగొట్టి బాలుణ్ని బయటికి తీశారు. అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వరదలు.. కారుపై కారు ఎక్కిన దృశ్యం