ఎడతెలిపి లేకుండా కురుస్తున్నవర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ జలాశయం నుంచి వస్తున్నవరద నీటితో ఊకచెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అల్లీపూర్ సమీపంలో ఈ వాగుపై ఉన్న చెక్ డ్యాం వద్ద జలసవ్వడి నెలకొంది. దీంతో గ్రామానికి చెందిన సాయిరాం గౌడ్(18)... చెల్లెలు, తల్లిదండ్రులతో కలిసి చెక్ డ్యాం వద్దకు వెళ్లారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి నీటిలో పడిన చెల్లిని పట్టుకునే ప్రయత్నంలో వరద ఉద్ధృతికి సాయిరాం కొట్టుకుపోయాడు.
వనపర్తి జిల్లా రామన్‌పాడు జలాశయం ఉన్న వెనుక జలాల్లో ఇవాళ అతని మృతదేహం ఎన్డీఆర్ఎఫ్సిబ్బందికి దొరకగా... తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి శవాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు.. గ్రామస్థులకు కంటతడి పెట్టించాయి.