మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడెంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో కిశోర్ అనే తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడు చరణ్‌కు తీవ్ర గాయాలు కాగా... ఆసుపత్రికి తరలించారు. ఇంటి రెయిలింగ్ పట్టుకోవడం వల్ల ప్రమాదం సంభవించింది. నాలుగు రోజులుగా ఊరంతా విద్యుదాఘాతం వస్తోన్నట్టు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ... పట్టించుకోలేదని ఆరోపించారు.
ఊరంతా విద్యుదాఘాతం.. బాలుడు దుర్మరణం.. - గౌతోజీగూడెంలో బాలుడి మృతి
నాలుగు రోజులుగా ఊరు ఊరంతా కరెంట్ షాక్ వస్తోంది. విద్యుదాఘాతానికి మెదక్ జిల్లా గౌతోజీగూడెంలో తొమ్మిదేళ్ల బాలుడు బలయ్యాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఊరంతా విద్యుదాఘాతం.. బాలుడి మృతి
బాలుడి మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. పోలీసులు అడ్డుకోగా... వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులే తమ కుమారుడి మృతికి కారణమని విలపించారు. బాలుడి తల్లిదండ్రులకు నచ్చచెప్పేందుకు జడ్పీ ఛైర్పర్సన్ హేమలత, పోలీసులు విఫల ప్రయత్నం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకొని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:తేనెటీగల దాడి..ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ
Last Updated : May 31, 2020, 10:41 PM IST