ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ముత్యాలమ్మ గుడి వెనుక ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన పసిపాపను గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. రక్తపు మరకలతో ఉన్న ఆ పసిగుడ్డును చూసిన వీధి కుక్కలు... పాపను ఎత్తుకెళ్లి నంబురి రామారావు అనే వ్యక్తి ఇంటిముందు వేశాయి.
అమానుషం: చెత్త కుప్పలో పడేస్తే... కుక్కలు పీక్కు తిన్నాయి - nelakondapally news
ఆ ప్రాణానికి రూపమెందుకిచ్చిందో ఆ తల్లి... రక్తపు మరకలు కూడా ఆరని ఆ పసిగుడ్డును చెత్తకుప్పలో పడేసేందుకా...? కళ్లు కూడా తెరచిచూడని ఆ పాపను కుక్కలు పీక్కుతినేందుకా...? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
born baby died in dogs attack in nelakondapally
అటుగా వెళ్తున్న మేకల రామారావు, ఎడపల్లి అరుణ పాపను గుర్తించారు. వెంటనే ఇరుగుపొరుగు వారికి తెలపగా... అంగన్వాడీ టీచర్లు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అంగన్వాడీ టీచర్లు పాపను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పసిపాప మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.