పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద విద్యుత్ స్తంభాన్ని బొలేరో వాహనం బుధవారం ఉదయం ఢీకొంది. అతివేగంగా వాహనం నడుపుతుండగా అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బొలేరో... తప్పిన ప్రమాదం - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామం వద్ద విద్యుత్ స్తంభాన్ని బొలేరో ఢీకొంది. స్తంభం విరిగి వాహనంపై పడడం వల్ల డ్రైవర్‌కు గాయాలయ్యాయి. మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బొలేరో... తప్పిన ప్రమాదం
వైజాగ్ నుంచి ఎన్టీపీసీకి బొలేరోలో వస్తున్న వ్యక్తులు దారితప్పారు. పెద్దపెల్లి నుంచి ఎన్టీపీసీకి వెళ్లాల్సి ఉండగా, పెద్దపెల్లి నుంచి మంథని మీదుగా ఎన్టీపీసీ వెళ్తున్న క్రమంలో గుంజపడుగు వద్ద ఈ ఘటన జరిగింది. స్తంభం విరిగి వాహనంపై పడింది. డ్రైవర్‌కు గాయాలు కాగా... వెనకాల కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదీ చదవండి:ఇందూరు నుంచి విదేశాలకు పిండి వంటలు