నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బోధన్ పట్టణ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,430 స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై మొగులయ్య తెలిపారు. పేకాట ఆడుతున్న వారిలో బోధన్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ పాల్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అదుపులో వార్డు కౌన్సిలర్! - nizamabad police
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బోధన్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అదుపులో వార్డు కౌన్సిలర్!