హైదరాబాద్ టోలీచౌకి విరాసత్‌నగర్‌లో సహాయక చర్యల్లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. వరదలో చిక్కుకున్న బాధితుల్ని తరలించే బోటు ఉన్నట్టుండి తిరగబడింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో కూర్చోబెట్టి బయలుదేరుతున్న సమయంలో బరువు ఎక్కువై.. బోటు తిరగబడింది.
లైవ్ వీడియో: తిరగబడ్డ బోటు.. రక్షించిన సహాయక సిబ్బంది - tollychouki boat overturn news
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో టోలీచౌకీ విరాసత్‌నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను తరలిస్తుండగా.. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఊహించని పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
లైవ్ వీడియో: తిరగబడ్డ బోటు.. రక్షించిన సహాయక సిబ్బంది
ఊహించని పరిణామంతో.. అంతా ఉలిక్కిపడ్డారు. చివరకు సహాయక సిబ్బంది బాధితుల్ని రక్షించి.. సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
Last Updated : Oct 15, 2020, 4:57 PM IST