మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. మరుకు కాలనీకి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఇంట్లోని మొదటి అంతస్తులో రెండు సార్లు పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో దుర్గయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం అతన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మున్సిపాలిటీ పరిధిలో పేలుళ్లు.. భయాందోళనలో ప్రజలు - blast in medak district
మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన పేలుళ్లు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఓ వ్యక్తికి చెందిన ఇంట్లోని మెుదటి అంతస్తులో రెండు సార్లు పేలుడు శబ్ధం వినబడడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రజలు అయోమయంలో పడిపోయారు.

మున్సిపాలిటీ పరిధిలో పేలుళ్లు.. భయాందోళనలో ప్రజలు
ఈ ప్రమాదంలో ఇంట్లోని కొన్ని వస్తువులు దగ్ధమవ్వగా పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంట్లో చిక్కుకున్న దుర్గయ్యను 108 వాహనంలో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే దుర్గయ్య ఇంట్లో ఏం పేలింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.