ఓ యువకుడిపై మరో యువకుడు బ్లేడుతో ఛాతిపై దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పాతపాడు గ్రామంలో జరిగింది. పాతపాడుకి చెందిన పామర్తి భార్గవ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం తన పెద్దమ్మ కుమారుడు బెజవాడ సాయి, అతడి స్నేహితులు హర్ష, విజయ్‌తో కలిసి కారులో పాతపాడు నుంచి విజయవాడకు బయల్దేరారు. వారు వెళ్తున్న కారుకు అడ్డంగా ద్విచక్రవాహనంపై మహ్మద్, రజాక్, లోకేష్ అనే యువకులు వచ్చారు. ప్రమాదం జరుగుతుందని గ్రహించిన కారులో ఉన్న సాయి... వాళ్లను వారించాడు.
చూసి నడపండని సాయి చెప్పిన మాటలు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురికి నచ్చలేదు. అంతే సాయితో ఆ యువకులు గొడవపడ్డారు. స్థానికులు అక్కడకు చేరి.. వారిని సముదాయించి అక్కడి నుంచి పంపేశారు.