హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో బర్కత్ అలీ అనే యువకుడిపై సాధిక్ అనే మరో యువకుడు బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బర్కత్ అలీకి తీవ్ర గాయాలయ్యాయి.
పాత కక్షలతో యువకుడిపై బ్లేడుతో దాడి - Blade attack on a young man in Hyderabad
పాతకక్షలతో ఓ యువకుడిపై మరో యువకుడు బ్లేడుతో దాడి చేసిన సంఘటన హైదరాబాద్ ఎన్టీఆర్నగర్లో చోటు చేసుకుంది. బాధితుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
పాత కక్షలతో యువకుడిపై బ్లేడుతో దాడి
అలీ కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతణ్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలతోనే సాధిక్ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బర్కత్ అలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
- ఇదీ చూడండి :అల్ఫాజోలం, డైజోఫాంలతోనే ఆ ఇద్దరు మృతి