రేమిడిచర్లలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బాలిక అదృశ్యంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో పదిహేడేళ్ల బాలిక గురువారం సాయంత్రం నుంచి కనిపించకపోవడం వల్ల పోలీసులు విచారణ చేపట్టగా... క్షుద్ర పూజల అంశం వెలుగుచూసింది.
బాలిక తల్లి వేరే ఊరు వెళ్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి అమ్మాయి కనిపించడం లేదని వాపోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్సై గోపాలరావు, పోలీసు సిబ్బందితో రేమిడిచర్లలోని ఆమె మేనమామ నివాసానికి వెళ్లగా... తమ ఇంట్లోకి రావద్దని వారు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. అనుమానం వచ్చిన ఎస్సై ఉదయ్ కిరణ్ వెళ్లి తలుపులు తీయించగా పెద్ద గొయ్యి కనిపించింది.