తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అరటిపండ్ల మాటున నల్లబెల్లం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నల్లబెల్లం అక్రమరవాణా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు క్వింటాళ్ల పటికను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

black jaggery illegal transportation at yellandu in bhadradri kothagudem
అరటిపండ్ల మాటున నల్లబెల్లం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్టు

By

Published : Oct 12, 2020, 7:30 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని కరెంట్ ఆఫీస్​ ఏరియాలో ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహంచారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ బొలెరో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది.

ఆపి సోదాలు నిర్వహించగా అరటి పండ్ల గెలల మాటున అక్రమంగా తరలిస్తున్న 12 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని గుడిసె సంతోష్, భూక్య బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి:నిషేధిత గుట్కా బ్యాగులు స్వాధీనం.. బీదర్​ నుంచి తీసుకొచ్చి విక్రయం

ABOUT THE AUTHOR

...view details