వనపర్తి జిల్లా కేంద్రంలో అబ్కారీ శాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 360 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ సుభాష్ చందర్ రావు తెలిపారు. ఇద్దరు దుకాణదారులు కలిసి హైదరాబాద్ నుంచి బెల్లం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గర్తించారు. వారిలో ఒకరైన కుమార్‌ను అరెస్ట్ చేయగా... చంద్రశేఖర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లబెల్లాన్ని సీజ్ చేసి... చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
వనపర్తిలో నల్లబెల్లం పట్టివేత... ఒకరు అరెస్ట్ - wanaparthy latest news
వనపర్తి జిల్లా కేంద్రంలో 360 కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు దుకాణదారులు ఈ బెల్లాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేయగా... మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నల్లబెల్లాన్ని విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వనపర్తిలో నల్లబెల్లం పట్టివేత... ఒకరు అరెస్ట్
ఇకపై వనపర్తి పట్టణానికి బెల్లాన్ని తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వ్యాపారులు సారా తయారీకి నల్లబెల్లం అమ్మడం మానుకోకపోతే వారి మీద పీడీ చట్టం ప్రయోగిస్తామన్నారు.