తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం... అరెస్ట్ చేస్తున్న పోలీసులు - అసెంబ్లీ ముట్టడికి యత్నించి భాజపా

అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి... గోషామహాల్ స్టేడియానికి తరలిస్తున్నారు. అరెస్టుల నేపథ్యంలో పోలీసులకు, భాజపా శ్రేణులకు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

bjp-leaders-arrest-at-gunpark-in-chalo-assembly
అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం... అరెస్ట్ చేస్తున్న పోలీసులు

By

Published : Sep 11, 2020, 1:16 PM IST

సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన భాజపా నాయకుల అరెస్ట్ ప్రక్రియ కొనసాగుతోంది. గన్ పార్క్, నాంపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయం, బషీర్ బాగ్​లోని నిజాం కళాశాల వద్ద అసెంబ్లీ వైపు దూసుకువచ్చిన భాజపా నాయకులను... పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు. పోలీసులకు భాజపా శ్రేణులకు వాగ్వాదం జరగడంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details