ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే అని పిటిషనర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. కరోనా విషయంలో ప్రభుత్వం మొదట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆయన...రాజధాని విషయంలో కూడా ప్రభుత్వం తప్పులు చేస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి సరిగా లేదని తెలిపారు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పాజిటివ్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ హైకోర్టు తీర్పు కనువిప్పు కావాలి: కామినేని శ్రీనివాస్ - ఎస్ఈసీగా రమేశ్ కుమార్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్ ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే అని పిటిషనర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.
హైకోర్టు తీర్పు కనువిప్పు కావాలి: కామినేని శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వద్ద తప్పులు పెట్టుకుని వ్యవస్థలను నిందించడం సరికాదన్నారు. నిమ్మగడ్డను తప్పించిన తీరు, కనకరాజ్‌ను నియమించిన తీరు దోషపూరితంగా ఉందని కామినేని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:రమేష్‌కుమార్‌ను పునర్నియమించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం