వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దొంగతనానికి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు.
బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా అరెస్టు
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ద్వి చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా అరెస్టు వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ.. బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా అరెస్టు
రైల్వే రడగంబాల బస్తీకి చెందిన జోసెఫ్ ఫ్రాన్సిస్ అనే రైల్వే ఉద్యోగి, పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకరు.. స్థానికులతో కలిసి 12 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. రూ. 8 లక్షల 50 వేల విలువ గల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను రామగుండం సీపీ అభినందించారు.
ఇదీ చదవండి:వరసకు కూతురైన మైనర్‌ను గర్భవతి చేసిన బాబాయ్