ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్న కుమార్తెను చూసొద్దామని వెళ్లిన ఓ తండ్రి, మనవరాలిని చూడాలని వెళ్లిన నాన్నమ్మ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో చోటుచేసుకొంది.
చూసొస్తామని వెళ్లి.. రాకుండానే వెళ్లిపోయారు - rangareddy crime news
అతివేగంతో ఓ ద్విచక్రవాహనదారుడు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీ, కుమారుడు దుర్మరణం చెందారు. కుమార్తెను చూసొద్దామని వెళ్లి.. రాకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు.
కొండకల్ చెందిన శివయ్య రైల్వే ఉద్యోగి.. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివయ్య చిన్నకుమార్తె సాంఘిక సంక్షేమ గురుకులంలోని వసతిగృహంలో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమార్తెను చూస్తొద్దామని తల్లి బుచ్చమ్మతో కలిసి శివయ్య శనివారం ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరుగుప్రయాణంలో అతివేగం, అజాగ్రత్తగా మోకిలా సమీపంలోని ఓ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.