తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్​.. ఇద్దరికి గాయాలు - బైక్​ ఢీ

రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన ఓ బైక్​ ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Bike collided with a person crossing the road Two injured in yadadri bhuvanagiri
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్​.. ఇద్దరికి గాయాలు

By

Published : Jan 12, 2021, 10:48 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న దంపతులను వేగంగా వచ్చిన ఓ బైక్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఫకీర్​ గూడెంకు చెందిన కృష్ణయ్యతో పాటు ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం వారివురిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న బైక్.. బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details