సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బెల్లాపూర్‌కు చెందిన ఇమందర్ తయ్యబ్ అలీ కొంతకాలంగా కూకట్‌పల్లిలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన బెల్లాపూర్‌కు వెళుతుండగా.. పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.