భికునూరులో ద్విచక్రవాహనాన్ని దగ్ధం చేసిన దుండగులు - కుమ్మరిగల్లిలో బైక్ దగ్ధం
కామారెడ్డి జిల్లా భికునూర్ కుమ్మరిగల్లికి చెందిన గొల్ల రవియాదవ్ అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భికునూరులో ద్విచక్రవాహనాన్ని దగ్ధం చేసిన దుండగులు
కామారెడ్డి జిల్లా భికునూర్లోని కుమ్మరిగల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని దగ్ధం చేశారు. స్థానికంగా నివాసం ఉండే గొల్ల రవియాదవ్ అనే వ్యక్తి బైక్ను సోమవారం అర్ధరాత్రి ఎవరో తగులబెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.