యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని యూపీకి చెందిన వ్యక్తి మృతి చెందారు. రైస్‌మిల్లులో పైకప్పుకు రేకులు బిగించడానికి వచ్చిన ఆర్యన్ అనే యువకుడు ఫోన్ మాట్లాడుతూ నడుస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గుండాల మండలానికి చెందిన సంగు సాయికృష్ణ మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై భువనగిరి నుంచి గుండాల వైపు వస్తుండగా ఘటన జరిగింది.
మోత్కూర్ సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి - యాదాద్రి భువనగిరి జిల్లా లేటెస్ట్ న్యూస్
ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ నడుస్తుండగా ప్రమాదం జరిగింది. ఆర్యన్ అనే యువకుని తలకు తీవ్రగాయాలై మృతిచెందారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మోత్కూర్ సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి
క్షతగాత్రులను 108 వాహనంలో తరలిస్తుండగా ఆర్యన్ మృతిచెందారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి:జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి