మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కౌకూర్ నుంచి యాప్రాల్ వెళ్లే మార్గంలోని పటేల్ అపార్ట్‌మెంట్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరిలో కృష్ణ వర్మ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
బైకును ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకరు మృతి - మేడ్చల్ జిల్లా రోడ్డుప్రమాదం వార్తలు
ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

బైకును ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకరు మృతి
గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.