సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి జారి పడి ప్రమాదవశాత్తు అతనిపై నుంచి టిప్పర్ లారీ వెళ్లడం వల్ల దుర్మరణం చెందాడు.
బైక్‌పై నుంచి జారి పడి వ్యక్తి మృతి - జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కిందపడటం వల్ల టిప్పర్ లారీ అతనిపై నుంచి వెళ్లింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
![బైక్‌పై నుంచి జారి పడి వ్యక్తి మృతి bike accident in ramachandrapuram sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9436253-42-9436253-1604550046724.jpg)
బైక్‌పై నుంచి జారి టిప్పర్ కింద పడటంతో వ్యక్తి మృతి
చందానగర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తి బైక్‌పై పటాన్చెరు వైపు వెళ్తుండగా అశోక్ నగర్ సమీపంలో బైక్‌పై నుంచి జారి రహదారిపై పడ్డాడు. అక్కడే వెనుక వస్తున్న టిప్పర్ అతనిపై నుంచి వెళ్లగా.. ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:టీఎస్‌బీపాస్ ప్రారంభానికి రంగం సిద్ధం
Last Updated : Nov 5, 2020, 10:31 AM IST