వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం 44వ జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్దుర్తికి చెందిన సుబాన్(22), శివ, కృష్ణ ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద గ్రామానికి వెళ్తుండగా... మోజర్ల వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. శివ, కృష్ణకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం 108లో వనపర్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి - వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా.. అదుపుతప్పి బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
![డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి bike-accident-at-wanaparthy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7499114-thumbnail-3x2-kee.jpg)
అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి